Thursday, August 7, 2008

కొన్ని మాటలు చెప్పేదా?

తోచినవి... తెలిసినవి... ఇవి కేవలం అభిప్రాయాలు నచ్చకపోతే నొచ్చుకోకండి నా తెలుగుకబుర్లు నా గ్రహణా'శక్తి ఇక్కడ పొందుపరిచాను
ఈరోజు : 7 ఆగష్టు 2008
జీ టీవి లో రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ప్రసారం అవుతున్న సరిగమప లో చిన్నారుల లాలిపాటలు నిజంగా చాలాబాగున్నాయి.చాలాకాలం తరువాత ఉష గారిని కూడా చూడగలిగాము.లాలిపాటలు చిన్నారులు నిద్రపోయేందుకు పెద్దలుపాడుతారు , అ లాలిపాటలు చిన్నారులే పాడుతుంటే అచ్చెరువొందని పెద్దలు ఉండకపోవచ్చు. మంచి కార్యక్రమం ,అలాగే చిట్టి నాయుడు మాటలు కార్యక్రమం కాస్త విభిన్నంగా ఉండేలా చేసింది.
ఉష పెళ్ళి చే సు కొని అమెరిక వెళ్ళి పోయిందని తెలుసు. అప్పుడెప్పుడో వినాయక చవితి కి హైదరాబాదు వచ్చి టివి 9 లో చూశాము . మళ్ళీ ఇలా చూడగలిగాము కదా అనుకున్నాము. మీ బాబు ఎలా వున్నాడు ఉష గారు ! :)

-->>ఇక రాష్ట్రం లో .....ఎనిమిదవ ఏట నుంచే చెస్ ఆడటం మొదలెట్టిన ద్రొణవళ్ళి హారిక (18) అర్జున అవార్డు కు ఎంపిక అయింది అభినందనలు తెలుపుదాము.

-->కరెంటు లేకపోతే క్షణం కూడా గడపలేమని ఇంకా ఎవరికైనా అనిపిస్తుందా.... గంటలైనా గడపగలం అంటారుకదా!!! అదే మరి కరెంటు కోతంటే ఎంత మార్పు ఇంతలోనే. టార్చిలైటు విలువ తెలిసిందిలే లేదా??? ఇంకా మీ ఏరియాలో కరెంటు కోత లేదన్నమాట! బాబ్బాబు ఏ ఏరియా మీది కాస్త చెప్పి వెలుతురు కట్టుకోండి.
--> సిమి పై నిషేదం ఎత్తివేసిన కోర్టు, కరుణానిధి ని మందలించిన కోర్టు, ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడన్న కోర్టు ,అవును ఏది న్యాయమో న్యాయస్థానాల కు మాత్రమే తెలుసు కదా:? న్యాయస్థానమా నీకిది న్యాయమా అని అడిగే కంటే సిమి పై సాక్షాలను చూపలేకపొయిన అధినాయకత్వమా మీరింతకుముందు ఏపాపము ఎరుగని సిమి పై నిషేదం విధించారా??? కనీసం సుప్రీం కోర్టులో నైనా మీ వాదన సరిగ్గా వినిపించండి, సిమి తరుపునకాదు ప్రభుత్వం తరుపున! లేకపోతే సిమి మంచి సంస్థ అని మేము అనుకోవాల్సి వస్తుంది ,అవును మేము కూడా కళ్ళు మూసుకొని న్యాయస్థానం ఏమి తీర్పిస్తే అదే వింటాము, అంటే ఒక్క మాట లో చెప్పాలంటే నమ్ముతాము లే.
-->ఇంతకాలం కల్తీ పురుగుమందులు,ప్రత్తి పంట నష్టాలు,కరెంటు కొతలు రైతులను వేటాడాయి , ఇప్పుడు ఎరువులు మేమేమైనా తక్కువా అంటూ కొరతతో కరీంనగర్ రైతన్నలను వేటాడుతున్నాయి. రైతుల గురించి ఎవరైనా మంచిమాటల మూటలే మాట్లాడుతారు ఎందుకంటే మిగతా వర్గాలు అంటే ఉద్యొగులు మొదలైనవారు కూడా ఆ సానుభూతిని మంచిదే అని మనకేమి నష్టం కాదుకదా అంటారు కాని ఇంత మంది సానుభూతి కలిగి ఉన్నా రైతులకు మంచి అనుభూతిని వ్యవసాయం మిగల్చటంలేదన్నది నిర్వివాదాంశమే మరి.
-->ఏమని చెప్పను ఎలాచెప్పను గుండెలనిండాగూడుకట్టుకొన్న సంఘర్షణల సాలెగూటిని ఏ భావరాగంతో పలికించి వినిపించను.అనుకొన్నవన్నీ జరగాలని ఆశించలేదు,అనుకోనివి జరగనేరాదని ఆదేశించనూ లేదు, నా ఈ చిన్నబ్రతుకును పెనుతుఫానుల గాలులతో పెకిలించినది చాలని ఇక నైనా కూసింత కరుణ చూపమని నిన్ను మనస్పూర్తిగా ప్రార్దిస్తున్నా ఓ భగవంతుడా!! ఉన్నావా ? వింటున్నావా?? అసలు వినాలనేఉద్దేశ్యం ఉందంటావా. నీవేలేవని అనుకోమంటావా!? అలానేననుకోననే కదా నీ మౌన అలాకన. అలకమాని అరకవైపు చూడవయా ! ఓ మహానుభావా!!

No comments: