Tuesday, August 12, 2008

రెండు రోజుల క్రితంవి

--> నమ్మకం ముఖ్యం , నమ్మకం ముఖ్యం అంటుంటారు కదా! అది ఎంత వరకు ముఖ్యమో చూద్దామా ! ఏపనైనా ప్రారంభించాలంటే కొంత ప్రేరణ కావాల్సిందే కదా,ఆ ప్రేరణే నమ్మకం . అది మనల్ని విజయానికై ప్రయత్నం మొదలెట్టేలా చేస్తుంది.పని మధ్యలో ఆటంకాలను ఎదుర్కొనేలా శక్తిని ఇస్తుంది. విజయం సాధించాక ఇదంతా నా గొప్పదనమేం కాదు నా నమ్మకమే నన్ను నిలబెట్టిందని నిలువరిస్తుంది.
ఏపనైనా చిత్తశుద్ధి తో , నమ్మకంతో ప్రారంభిస్తే అది విజయానికి చేరువలో నైనా నిన్ను నిలుపుతుంది. మనకంత లేదు ,మనకేం వస్తుంది అనుకుంటే మనకేమీ రాదు. చివరకు చిత్రమేమి జరగదు మన భవిష్యత్ చిత్రంలో.
అవాంతరాలు అతి సహజం అవి జయిస్తేనే అందుతుంది అతి సుందరమైన భవిత.నిర్ణయం నిర్దేశించు కోవడం మీచేతుల్లో ఉంది. మీప్రమేయం లేకుండా మేజీవితాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. అందుకే మీమనస్సును ద్రుఢపరుచుకోండి. " ద్రుఢసంకల్పంతో చివరి వరకూ ప్రయత్నించండి. "


/-->/ ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా ఇండియా ఎప్పుడు గెలిచిందో!గోటితో పోయే ఆటను గొడ్డలి గా మార్చేసి వ్యయప్రయాసలతో గెలవడం మన హాభీ కదా. సీనియర్లు ఉన్నరా! ఉంటే నిలుస్తారా !! నిలిచినా వారే గెలుస్తారా లేక జట్టును కూడా గెలిపిస్తారా !!! ఒలంపిక్స్ లో క్రికెట్ చేరిస్తే కప్పు ఎవరికి వస్తుందో?!.


-->నందిని , పవన్ కల్యాణ్ ల వివాదాం మొత్తానికి కోర్టు బయటే పరిష్కారం అవడం జరిగింది. వివరాలు నెమ్మదిగా బయటకు వస్తాయేమో.


-->జీవితంలో ఒలంపిక్స్ ఒకసారి అయినా ప్రత్యక్షంగా "చూడాలని వుంది".

-->శ్వేతా పెదాలపై ఏంటా లిప్ స్టిక్ పూత,
అయిందా నీ పొలంలో వరికోత ,
వీపున ఏంటా పుస్తకాల మోత,
మార్చగలవా నువ్వు నా తలరాత ,
మీ నాన్న చూస్తే పెడతాడు వాత,
అందుకే నేను దూరంగా పోతా .

-->చంద్రుడు పగటిపూట వున్నా కనిపించడు ,
దేవుడు సుఖంగా వున్నప్పుడు గుర్తుకురాడు,
మిత్రుడు అవసరంలేనప్పుడు అగుపడడు,
పరీక్షలు మార్చిలో కానీ రావు,
కాని నీ తలపులు ఎల్లవేళలా మరచిపోలేను ఎందుకని?
--> ఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరాముందుకు అంతో ఇంతో అభివ్రుద్ది వైపుకూ..........









-------------------------------------
తెలుగు వాళ్ళందరికి నమస్కారమండి!
మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి
ఇట్లు మీ ఆంధ్రుడు.
-------------------------------------

0 comments: